Hyderabad : ట్యాంక్ బండ్ వద్దకు మంత్రి, ప్రజాప్రతినిధులు.. ఏర్పాట్ల పరిశీలన

రేపు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరుగుతుండటంతో ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను తెలంగాణ మంత్రులు పరిశీలించనున్నారు.

Update: 2025-09-05 04:23 GMT

రేపు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరుగుతుండటంతో ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను తెలంగాణ మంత్రులు పరిశీలించనున్నారు. ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేశ్ లు పర్యటించనున్నారు.

క్రేన్ల ఏర్పాట్లతో పాటు...
ట్యాంక్ బండ్ కు దాదాపు యాభై వేలకు పైగా విగ్రహాలు రేపు చేరుకోవడంతో మినీ, భారీ క్రేన్ల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అలాగే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నిమజ్జనం అయ్యే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రేన్ ను కూడా పరిశీలించనున్నారు. వీరితో పాటు అధికారులు కూడా పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.


Tags:    

Similar News