Telangana : నేడు బతుకమ్మ కుంట పునర్ ప్రారంభం
హైదరాబాద్ లో బతుకమ్మ కుంటను నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ లో బతుకమ్మ కుంటను నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న పెద్ద చెరువును పూర్వకాలంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఉపయోగించే వారు. అందుకే దానికి బతుకమ్మ కుంట అని పేరు వచ్చింది. అయితే కాలక్రమేణా ఆక్రమణలతో పాటు అక్కడ బతుకమ్మ కుంట కనిపించకుండా పోయింది.
7.4 కోట్ల రూపాయల వ్యయంతో...
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని నిర్ణయించి ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. దీంతో బతుకమ్మ కుంటను తిరిగి పునర్మించారు. 7.4 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ కుంటను పునర్ నిర్మించారు. ఈరోజు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బాగ్ అంబర్ పేట్ లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.