ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని దర్శించుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని దర్శించుకున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని దర్శించుకున్నారు. గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా మంటపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి 71 ఏళ్లుగా నిరంతరాయంగా నిర్వహిస్తూ రాష్ట్రానికి పేరు తెస్తుందని అన్నారు.
గణేశ్ ఉత్సవాలకు...
గణేశ్ ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. అలాగే నిమజ్జనం సందర్భంగా అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. భక్తుల మనోభావాలకు తగినట్లుగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రేపు జరగనున్న గణేశ్ నిమజ్జనం సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.