Revanth Reddy : హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థను ప్రారంభించిన రేవంత్

హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Update: 2025-02-24 07:05 GMT

హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ బయోటెక్ సంస్థ ఆమ్జెన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ లో ఆమ్జెన్ సంస్థ తన కార్యాలయంతో పాటు ఇన్నోవైషన్ సైట్ ను కూడా ప్రారంభించింది. హైటెక్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవ్ంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

విస్తృత అవకాశాలు...
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆమ్జెన్ సంస్థ తన కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించడం శుభపరిణామమని, కంపెనీ రాకతో బయో సైన్స్ లో హైదరాబాద్ హబ్ గా మారుతుందని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని, ఈ కంపెనీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగపడనున్నాయని చెప్పారు. ట్రిలియన్ డాలర్ జీడీపీస్టేట్ గా తెలంగాణను మార్చడమే తమ ప్రయత్నమని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News