Telangana : నేడు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.

Update: 2025-12-10 03:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆర్ట్స్ కళాశాల భవనం దగ్గర జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినప్పుడు తాను మరోసారి వచ్చి అందరినీ కలుస్తానని చెప్పారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం వెయ్యి కోట్ల రూపాయలను రేవంత్ నాడు ప్రకటించారు.

వెయ్యి కోట్ల విడుదల...
ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఈ నిధులకు సంబంధించిన పనులను విద్యార్థులతో కలసి చర్చించి నిర్ణయించుకోవాలని నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు రెండో సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండటంతో యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండోసారి వర్సిటీకి వస్తుంటంతో సభకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల పనులకు సంబంధించి డీపీఆర్ సిద్ధం కావడంతో రేవంత్ మరోసారి నేడు యూనివర్సిటీకి రానున్నారు.


Tags:    

Similar News