Hyderabad : జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి
హైదరాబాద్ యాకూత్‌పురాలో గురువారం ఓ ఆరేళ్ల చిన్నారి ఓపెన్ మాన్‌హోల్‌లో పడిపోగా, వెనుక నడుస్తున్న తల్లి అప్రమత్తమై వెంటనే ఆమెను బయటికి లాగి ప్రాణాపాయం నుంచి బాలికను రక్షించింది.
హైదరాబాద్ మున్సిపల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి ఎందరో బలవుతున్నారు. వర్షాలు పడుతుండటంతో తెరచిన మ్యాన్ హోల్స్ ను తిరిగి మూసివేయడం కూడా చేయడం లేదు. దీంతో చిన్నారులు మ్యాన్ హోల్స్ లో పడిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్ యాకూత్‌పురాలో గురువారం ఓ ఆరేళ్ల చిన్నారి ఓపెన్ మాన్‌హోల్‌లో పడిపోగా, వెనుక నడుస్తున్న తల్లి అప్రమత్తమై వెంటనే ఆమెను బయటికి లాగి ప్రాణాపాయం నుంచి బాలికను రక్షించింది.
తల్లి రక్షించడంతో...
ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలో చిన్నారి అజాగ్రత్తగా మూతలేని మాన్‌హోల్‌లో జారి పడగా, వెంటనే గమనించిన తల్లి పరుగెత్తి వచ్చి ఆమెను పైకి లాగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో వైరల్ గా మారింది. వర్షం కురిసినప్పుడు తెరిచిన మ్యాన్ హోల్స్ మూతలను వర్షం ఆగిపోయిన తర్వాత వాటిని మూసివేయడం మాత్రం హైదరాబాద్ మున్సిపల్ శాఖ సిబ్బంది మర్చిపోతున్నారు. సకాలంలో తల్లి వెనక ఉండి బాలికను రక్షించడంతో ఒక ప్రాణం దక్కింది. లేకుంటే ఏమయ్యేదంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.