సమంతను ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో?

సినీ నటి సమంత కు చేదు అనుభవం ఎదురైంది.

Update: 2025-12-22 04:51 GMT

సినీ నటి సమంత కు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈవెంట్‌లో సమంతను అభిమానులు చుట్టుముట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంపులో నుంచి బయటపడి కారుకు చేరేందుకు ఆమె కష్టపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు ప్రణాళికతో సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

వరసగా అభిమానుల దెబ్బకు...
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రచార కార్యక్రమంలో కొన్ని రోజుల క్రితం నిధి అగర్వాల్‌కు ఎదురైన అసౌకర్య ఘటన ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అభిమానుల గుంపులో చిక్కుకున్న నిధి, తన వాహనం వరకు చేరేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ ఘటన భద్రత, గుంపుల నియంత్రణపై ఆందోళనలు పెంచింది.గతంలోనూ పలువురు నటులు, ముఖ్యంగా నటీమణులు, గుంపుల వల్ల ఇబ్బందికర అనుభవాలు ఎదుర్కొన్నారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు కొందరు ముందడుగు వేయడంలో వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఈవెంట్‌లు సజావుగా సాగాలంటే నిర్వాహకులు అవసరమైన అనుమతులు తీసుకుని, పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


Tags:    

Similar News