Hyderabad : హైదరాబాద్ లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Update: 2025-10-22 02:08 GMT

హైదరాబాద్ లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సదర్ ఉత్సవ్ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. దీపావళి పండగ తర్వాత యాదవ సోదరులు సదర్ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. సదర్ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు.

సదర్ ఉత్సవం నేపథ్యంలో...
అయితే సదర్ ఉత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రధానంగా నగరంలోని వైఎంసీఏ వద్ద సదర్ ఉత్సవ్ జరగనుంది. దీంతో పాటు రామ్ కోటి, లింగంపల్లి, నారాయణ గూడ, బర్కత్ పుర, హిమాయత్ నగర్ లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.


Tags:    

Similar News