ఎంజీబీఎస్ కు రావద్దు.. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే?
మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరిందని ఎవరూ బస్టాండ్ కు రావద్దని ఆర్టసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు
మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరిందని ఎవరూ బస్టాండ్ కు రావద్దని ఆర్టసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలు సిద్ధమయ్యాయి. ఎక్స్ వేదికగా సజ్జనార్ ప్రయాణికులను కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈరోజు మూసీ నది ప్రవాహం పొంగి పొరలి వస్తుండటంతో ఎవరూ ఎంజీబీఎస్ కు రావద్దని కోరింది.
ఇక్కడ నుంచి...
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి, సూర్యాపేట్, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లు బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడుస్తును్నాయని తెలిపారు. ఎంజీబీఎస్ కు తెలియక వచ్చే వారి కోసం ఆర్టీసీ లోకల్ సర్వీసులను నిర్వహిస్తుందని కూడా సజ్జనార్ తెలిపారు.