Bus Accident : మక్కాకు వెళ్లి సజీవ దహనమయి.. సెల్ ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో?
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువ ఉన్నారు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువ ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ఫోన్లలోకి కూడా అందుబాటులోకి రాకపోవడంతో మక్కా కు వెళ్లిన వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా మొహిదీపట్నం, అజీజ్ నగర్ ప్రాంతం నుంచి అత్యధిక మంది మక్కా కు వెళ్లారు. మక్కా నుంచి మదీనాకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొంటడంతో మంటలు చెలరేగి 42 మంది సజీవ దహనమయ్యారు. డ్రైవర్ తప్ప అందరూ సజీవ దహనమయ్యారని తెలిసింది. హైదరాబాద్ లోని రెండు ట్రావెల్స్ నుంచి మక్కా కు టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్లారని తెలిసింది.
ఎక్కువ మంది వీరే...
మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. మిగిలిన వారంతా పురుషులే. ఈ ఘటన బదర్ - మదీనా మధ్య ముఫరహత్ దగ్గరలో జరిగింది. సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ అవుతుండటంతో ఈ ప్రమాదంలో వారు ఏమయ్యారన్న ఆందోళనలో బాధితులు ఉన్నారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని తెలియడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్న కాన్సులేట్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. రియాద్ లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబూ జార్జితో తాను మాట్లాడనని, ఈ ఘటనపై వివరాలను తెలుసుకుంటున్నానని అసదు తెలిపారు.
దాదాపు అందరూ తెలంగాణ వాసులే...
ప్రమాదానికి గురైన వారిలో అందరూ తెలంగాణవాసులేనని అంటున్నారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.