Revanth Reddy : నేడు యూసఫ్ గూడకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యూసఫ్ గూడలో జరిగే సభలో పాల్గొననున్నారు. నేడు యూసుఫ్‌గూడలో సీఎం రేవంత్ రెడ్డి సభకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల అభినందన సభ నేడు జరగనుంది.
సినీ పరిశ్రమ కార్మికులతో...
ఇటీవల సినీపరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయడంతో ఆయనకు సినీ కార్మికులు అభినందన సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్‌లో కార్యక్రమం జరగనుంది. ఈ సభలో సినీ కార్మికులకు పలు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశముందని అంటున్నారు.