హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ప్రేమజంట అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఒక ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-12-24 07:29 GMT

police seized drugs in hyderabad

హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఒక ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లిలో ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇదే కేసులో వారిచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

డ్రగ్స్ స్వాధీనం...
ఓజీఎంఏ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రేమ జంట సాఫ్ట్ వేర్ ఇంజీనీర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని విచారించిన అనంతరం వీరు డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News