నేడు తెలంగాణ భవన్‌లో అసెంబ్లీకి సమాంతర సమావేశం
నేడు తెలంగాణ భవన్‌లో అసెంబ్లీకి సమాంతరంగా సమావేశం జరగనుంది.
నేడు తెలంగాణ భవన్‌లో అసెంబ్లీకి సమాంతరంగా సమావేశం జరగనుంది. అసెంబ్లీలో జరిగే చర్చలపై బీఆర్ఎస్ నేతలు స్పందించనున్నారు. అసెంబ్లీలో నేడు హిల్ట్ పాలసీ పై చర్చ జరగనుంది. దీనిపై నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే హిల్ట్ పాలసీని తీసుకు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
హిల్ట్ పాలసీపై
హిల్ట్ పాలసీ లో రూపొందించిన నిబంధనలను కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించడంతో రెండు లక్షల మంది కార్మికులు ఇబ్బందులు పడతారంటారు. అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు పరిశ్రమలను తరలిస్తే కార్మికులు రోడ్డున పడతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీంతో హిల్ట్ పాలసీపై తెలంగాణ భవన్ లో చర్చ జరగనుంది.