Hyderabad : ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి పనులు ప్రారంభం

ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన పనులు నేడు ప్రారంభమయ్యాయి

Update: 2025-10-03 07:34 GMT

ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన పనులు నేడు ప్రారంభమయ్యాయి. మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ ఈ పనులను ప్రారంభించింది. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో ఈ పనులు మొదలయ్యాయి. దసరా సందర్భంగా మెగా ఇంజినీరింగ్ కంపెనీ అధ్యక్షుడు కె.గోవర్ధన్‌రెడ్డి పూజలు నిర్వహించి పనులకు శంకుస్థాపన చేశారు.

గోషామహల్ లో...
ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అధికారికంగా ఈరోజు నుంచి పనులు మొదలయ్యాయి. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో నిర్మించేలా డిజైన్లను రూపొందించారు. అన్ని రకాల వసతులను సమకూరుస్తున్నారు.


Tags:    

Similar News