ఏప్రిల్ 23న ఆలయానికి నీతా అంబానీ.. ఇప్పుడేమో కోటి రూపాయలు విరాళం
పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సాయం అందిస్తామని చెప్పిన నీతా అంబానీ తాజాగా కోటి రూపాయలు విరాళాన్ని అందించారు. ఈ విరాళం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.