Hyderabad : కొత్త బోర్డు వచ్చేసింది
ట్యాంక్‌బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.
ట్యాంక్‌బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సమావేశంలోనూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’గా మార్చారు.
తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లైఓవర్‌పై కొత్త పేరుతో బోర్డును అమర్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశం అధికారికంగా అమలైనట్లయింది. నగరంలోని ప్రముఖ ల్యాండ్‌మార్క్‌కి ఇది తాజా పేరుమార్పుగా నిలిచింది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నేడు తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా మారింది. ఈ మేరకు బోర్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి.