Breaking : ఇక ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాదే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు

Update: 2025-11-14 08:07 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమదే గెలుపని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైన అవగాహన ఉందని, దేశంలోని ఇతర నగరాల్లో కంటే హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తారన్ననమ్మకం ప్రజల్లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

అభివృద్ధి..సంక్షేమం...
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు,అభివృద్ధి కాంగ్రెస్ ను గెలిపిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరుగులేని విజయాన్ని కట్టబెడతారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News