జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : బీజేపీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో మియాపూర్‌లో బీజేపీ కీలకనేతల సమావేశం జరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో మియాపూర్‌లో బీజేపీ కీలకనేతల సమావేశం జరిగింది. మియాపూర్ లోని నల్లూరి పట్టాభిరామ్ సమక్షంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు , కార్యదర్శి గౌతమ్ , మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
అందరూ సమన్వయంతో...
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మాట్లడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది. రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించడం కోసం కొన్ని కీలక అంశాలను చర్చించారు. కొన్ని బాధ్యతలు నల్లూరి పట్టాభిరామ్‌కు అప్పగించారు. గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.