హైదరాబాద్‌లో యుద్ధవిమానాల విడిభాగాల తయారీ
భారతదేశంలో యుద్ధ విమానాల తయారీ రంగంలో కీలక ఒప్పందం జరిగింది.
Rafale fighter Jets
భారతదేశంలో యుద్ధ విమానాల తయారీ రంగంలో కీలక ఒప్పందం జరిగింది. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్, భారత టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల కీలక భాగాలను భారతదేశంలో తయారు చేయనున్నారు.
అది కూడా హైదరాబాద్ లో!! ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లో టాటా సంస్థ ఆధ్వర్యంలో అధునాతన ఉత్పత్తి కేంద్రం స్థాపించనున్నారు. 2028 నాటికి ఈ అసెంబ్లింగ్ లైన్ మొదలు కాబోతుందని దసాల్ట్ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు రాఫెల్ ఫ్యూసలాజ్ నిర్మాణం ఫ్రాన్స్‌లో మాత్రమే జరిగింది. మొదటిసారి భారతదేశంలో ఉత్పత్తి కాబోతుండటం విశేషం.