Hyderabad : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో స్థానికులు ఆందోళనకు దిగారు

Update: 2025-12-23 05:02 GMT

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో స్థానికులు ఆందోళనకు దిగారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హయత్ నగర్ సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపు ఉండే కాలనీ వాసులు ఈ మేరకు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

హయత్ నగర్ లో ఆందోళనతో...
అటు, ఇటు పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తమకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఇటీవల వైద్యవిద్య చదువుతున్న ఐశ్వర్య రోడ్డు దాటుతూ మృతి చెందడంతో పాటు అతని తండ్రి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో స్థానికులను సముదాయించి పోలీసులు ఆందోళనను విరమింప చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News