Telangana : ఆర్టీసీ బస్సులకు పెరిగిన గిరాకీ
కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణికులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు
కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణికులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణం సురక్షితం కాదని భావించి టీజీఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరొకవైపు ప్రయివేటు ట్రావెల్స్ యాజమానులు కూడా భయంతో తమకు బుక్ అయిన టిక్కెట్లను రద్దు చేస్తున్నారు.
ప్రయివేటు బస్సుల యాజమాన్యం...
ఫిట్‌నెస్ లేని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేస్తుండటంతో పాటు ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేయడంతో ముందుగా బుక్ చేసిన టికెట్లను సైతం ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యాలు రద్దు చేస్తున్నాయి. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని భావిస్తుండటంతో ఆర్టీసీకి గిరాకీ పెరిగింది.