BRS : నేడు కేటీఆర్ కీలక భేటీ
తెలంగాణ భవన్ లో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం జరగనుంది
తెలంగాణ భవన్ లో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. నేడు జరిగే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది.
డివిజన్ల వారీగా...
డివిజన్ల వారీగా బాధ్యతలను కేటీఆర్ నేతలకు అప్పగించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి ఓటరును పార్టీ వైపు తిప్పేలాతమ అనుచరులతో కలిసి పర్యటించాలని సూచించనున్నారు. బస్తీల్లో సమావేశాలు పెట్టి వారికి ఏమేం హామీలు ఇవ్వాలో చెప్పనున్నారు. మాగంటి సునీతకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పనున్నారు.