BRS : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు రోడ్ షోల ద్వారా తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. నేడు షేక్ పేట్ లో కేటీఆర్ రోడ్ షో కొనసాగనుంది. రేపు యూసఫ్ గూడ, ఎల్లుండి బోరబండలో కేటీఆర్ ప్రచారాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
షేక్ పేట్ లో రోడ్ షో...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇక హరీశ్ రావు తండ్రి మరణించడంతో ఆయన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. దీంతో కేటీఆర్ ఒక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆయన ఈ ఉప ఎన్నికను తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని నడిపిస్తున్నారు.