Jublee Hills Bye Election : నామినేషన్లకు రేపు తుది గడువు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది

Update: 2025-10-20 03:46 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బస్తీల్లో సభలు నిర్వహిస్తున్నారు.

ప్రచారం ముమ్మరం...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు బీఫారాలు అందచేశాయి. రేపు నామినేషన్ల దాఖలుకు తుదిగడువు కావడంతో ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ నవంబరు పథ్నాలుతో తేదీన జరగనుంది.


Tags:    

Similar News