Telangana: సెక్రటేరియట్ లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు

తెలంగాణ సెక్రటేరియట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక సేవలు నిలిచిపోయాయి

Update: 2025-09-11 07:57 GMT

తెలంగాణ సెక్రటేరియట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక సేవలు నిలిచిపోయాయి. తెలంగాణ సెక్రటేరియట్ లో ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అన్ని పనులు స్థంభించిపోయాయి. కాగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అనేక ముఖ్యమైన పనులు నిలిచిపోయాయి.

పనులు నిలిచిపోయి...
తెలంగాణ సచివాలయంలోని ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయంపై ఇప్పటికే సదరు కంపెనీలతో అధికారులు సంప్రదించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని వారు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు పనిచేసేందుకు వీలు కలగడం లేదు.


Tags:    

Similar News