క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు

క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయాన్ని ఆదాయపు పన్ను అధికారులు సీజ్ చేశారు.

Update: 2025-09-21 04:21 GMT

క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయాన్ని ఆదాయపు పన్ను అధికారులు సీజ్ చేశారు. ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు చందా శ్రీనివాస్, అభిషేక్‌ను విచారించినట్లు చెబుతున్నారు.

ఆదాయపు పన్ను చెల్లింపులో...
హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచిన క్యాప్స్ గోల్డ్ యాజమాన్యం ఆదాయపు పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింి. బంగారం స్కీమ్‌లు నడిపిస్తున్న క్యాప్స్ గోల్డ్ నగదు ట్రాన్సాక్షన్ విషయంలో అవకతవకలు ఐటీ అధికారుల గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10తో పాటు మహంకాళి స్ట్రీట్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News