వాసవి గ్రూపు కంపెనీల్లో ఐటీ సోదాలు

వాసవి గ్రూపు కంపెనీల్లో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-09-18 02:57 GMT

వాసవి గ్రూపు కంపెనీల్లో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి గ్రూపునకు సంబంధించిన ఛైర్మన్ అభిషేక్, డైరెక్టర్ సౌమ్య, చందా శ్రీనివాసరావు ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ సంస్థకు సంబంధించిన నిధులను పక్క దారి మళ్లించారన్న ఆరోపణలతో ఈ సోదలు జరుగుతున్నాయి.

పన్ను ఎగవేతతో పాటు...
అంతేకాదు దీని ద్వారా వచ్చిన సొమ్మును ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ కొనుగోలుకు ప్రయత్నించినట్లు కూడా ఆదాయపు పన్నుల శాఖల అధికారుల తనిఖీల్లో బయటపడినట్లు తెలిసింది. అదే సమయంలో అభిషేక్, సౌమ్యకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో మొత్తం ఆరు చోట్ల ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పూర్తి సమాచారాన్ని అధికారికంగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News