Hyderabad : 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిన కాపాడిన హైడ్రా

హైదరాబాద్ లోని కొండాపూర్ లో హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు

Update: 2026-02-10 05:18 GMT

హైదరాబాద్ లోని కొండాపూర్ లో హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు. దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయ పరిధిలో ఉన్న మదీనాగూడ మార్గంలో హైడ్రా ఈరోజు ఉదయం ఈ ఆపరేషన్ నుచేపట్టింది. ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి.

ఫెన్సింగ్ ఏర్పాటు చేసి...
ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలసి జగంమోనికుంటకు చెందిన నాలుగు ఎకరాల భూమిని కాపాడారు. కొందరు కబ్జాదారులు నాలుగు ఎకరాల భూమిని కాపాడారు. ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడ ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు అక్కడ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఏడు వందల కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లయింది.


Tags:    

Similar News