టీడీపీ ఎమ్మెల్యే వసంతకు రేవంత్ సర్కార్ షాక్

టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఫామ్ హౌస్ ను హైదరాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చి వేశారు

Update: 2025-04-19 12:33 GMT

టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఫామ్ హౌస్ ను హైదరాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చి వేశారు. కొండాపూర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారని హైడ్రా అధికారులకు ఫిర్యదు అందడంతో దానిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

ఫిర్యాదు అందడంతో....
అనంతరం ఫిర్యాదును పరిశీలించి 39 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్నట్లు నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నా పోలీసు బందోబస్తుతో వాటిని కూల్చివేశారు. అయితే తాను పూర్తిగా అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపట్టానని, అన్ని అనుమతులు ఉన్నాయని వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే హైడ్రా అధికారులకు అన్ని రకాలుగా పత్రాలను ఇచ్చినట్లు సమాచారం. అయినా అవి ప్రభుత్వ భూములుగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు.


Tags:    

Similar News