Hyderabad : తాగుబోతులకు సజ్జనార్ వార్నింగ్
మద్యం తాగి వాహనాలను నడిపే వారిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు
మద్యం తాగి వాహనాలను నడిపే వారిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి అడుగడుగునా తనిఖీలు ఉంటాయని ఆయన తెలిపారు. ఎవరైనా తాగి నడిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని, చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి మద్యం తాగిన వాళ్లు క్యాబ్ లలో, ఆటోల్లో ఇళ్లకు చేరుకోవడం మంచిదని సూచించారు.
క్యాబ్ లలో మాత్రమే..
అలా కాకుండా తాగి మద్యం నడిపితే ఇక అంతే సంగతులు అని సజ్జనార్ హెచ్చరించారు. కేవలం కౌన్సిలింగ్ మాత్రమే చేయబోమని తీవ్రమైన చర్యలుంటాయని సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. వీలయినంత వరకూ పబ్ నిర్వాహకులు కూడా మద్యం సేవించిన వారిని క్యాబ్ లలో వెళ్లేలా వారికి సూచనలు చేయాలనిసజ్జనార్ కోరారు. నగరంలో అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.