Hyderabad నేటి నుంచి మెట్రో రైలు ఛార్జీలు పెంపు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నాటి నుంచి పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి

Update: 2025-05-17 02:41 GMT

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నాటి నుంచి పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైలు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. కనీసం పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకూ ఛార్జీలు పెంచనుంది.

కొన్ని ప్రాంతాల్లో...
కొన్ని ప్రాంతాల్లో ఇరవై రూపాయల వరకూ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెండింగ్ లో ఉంది. A మెట్రో రైళ్లకు ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ నష్టాలు వస్తున్నాయని మెట్రో రైలు సంస్థ చెబుతుంది. చాలా రోజుల నుంచి ఛార్జీలను పెంచేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. నేటి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి.


Tags:    

Similar News