హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ మేరకు మెట్రో సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించా
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ మేరకు మెట్రో సంస్థ ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. జర్మనీ-హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు లభించిందని మెట్రో ఎండీ తెలిపారు.
అరుదైన గుర్తింపు...
ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్' ప్రాజెక్టుకు గాను పురస్కారం లభించిందని చెప్పారు. హైదరాబాద్ లో మెట్రో సేవలు విస్తరించడంతో పాటు ఆక్యు పెన్సీ రేటు కూడా పెరగడంతో హైదరాబాద్ లోని మెట్రో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు సేవలను కూడా విస్తృతం చేశామని సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.