మూసీ ముంచేసింది

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోకి కూడా వరదనీరు ప్రవేశించింది

Update: 2025-09-27 03:06 GMT

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోకి కూడా వరదనీరు ప్రవేశించింది. నార్సింగి, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, చంచల్ గూడ ప్రాంతాల్లో భారీవర్షం నమోదు కావడంతో పాటు జంట జలాశయాల గేట్లును కూడా తెవరడంతో హైదరాబాద్ నగరంలోని మూసి నదీ పరివాహక ప్రాంతం మొత్తం మునకకు గురయింి. చాదర్ ఘాట్ లోలెవెల్ వంతెన పై నుంచి ఆరుఅడుగులమేర నీరు ప్రవహిస్తుంది. భయానకంగా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేసింది. ముసారం బాగ్ వంతెన పై నుంచి పది అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది.

మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోకి...
ఇక మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోపలికి వెళ్లే రెండు వంతెనలు నీటమునిగాయి. వరద నీరు బస్టాండ్ లోకి చేరింది. దీంతో ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకు రాగలిగారు. మూసీ నది నగరంలో బీభత్సం సృష్టిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నది నగరంపైన పింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాణాలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.
నేడు కూడా భారీ వర్షాల హెచ్చరికతో...
ఈరోజు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో నగరవాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు.అర్థరాత్రి నుంచి ఈ గండం నుంచిబయట పడటమెలా? అనివారుబితుకు బితుకు మంటూ గడిపారు. జంట జలాశాయాల నుంచి దాదాపు 13,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో అది నగరంపైన పడింది. అనేక బస్తీలు నీట మునిగాయి. చాలా మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసానగర్,శంకర్ నగర్ బస్తీలను ఖాళీ చేయించారు. రెండు వంతెనలపై నుంచి రాకపోకలను నిలిపేశారు. మొత్తం మీద మూసీ నగరాన్ని ముంచేసింది. ఈరోజు ఎలా గడుస్తుందన్నది చూడాల్సి ఉంది.



Tags:    

Similar News