Hyderabad : వీకెండ్ లో హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 800 మందిపై కేసులు
హైదరాబాద్ లో వీకెండ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న న 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు
హైదరాబాద్ లో వీకెండ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న న 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 403 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎనిమిది మందికి రక్తంలో ఆల్కహాల్ మోతాదు 100 మిల్లీలీటర్లకు 300 మైక్రోగ్రాములకుపైగా నమోదైంది. అనుమతించిన పరిమితి 30 మైక్రోగ్రాములు మాత్రమే. డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ పాటిస్తామని నగర ట్రాఫిక్ పోలీసుల జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు.
సైబరాబాద్‌లో 409 కేసులు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 409 కేసులు నమోదు చేశారు. మియాపూర్‌లో అత్యధికంగా 81 కేసులు నమోదయ్యాయి. తరువాత చేవెళ్ల 44, శంషాబాద్ 34 కేసులతో నిలిచాయి. పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే. డ్రంక్ డ్రైవింగ్ చేసిన వారిలో 31–40 ఏళ్ల వయస్సు గలవారు మూడో వంతుకు పైగా ఉన్నారని పోలీసులు తెలిపారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సైబరాబాద్ అంతటా ఈ తరహా ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. పండుగల సీజన్‌లోనూ, వీకెండ్ రోజుల్లోనూ తనిఖీలు మరింత కఠినంగా చేపడతామని వెల్లడించారు.