అక్కడికి ఒంటెను ఎలా తీసుకొచ్చావయ్యా?
ఆరాంఘర్ వైపు వెళ్లే PVNR ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కుర్రాడు ఒంటెపై వెల్తూ కనిపించాడు.
హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే PVNR ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కుర్రాడు ఒంటెపై వెల్తూ కనిపించాడు. కొందరు వేరే వాహనాల్లో వెళ్తూ రికార్డు చేయడం మొదలుపెట్టారు. చాలా దూరం వరకు అలానే ఒంటె వెళ్ళింది.
అయితే ఆ ఒంటెను వెంబడిస్తూ వెళ్లిన వాహనదారులు కొద్ది దూరం వెళ్లాక ఆ ఒంటెపై కూర్చొని సవారీ చేస్తున్న కుర్రాడిని అడ్డుకున్నారు. ఆ ఒంటెను దాని మెడలో ఉన్న తాడుతో పక్కనున్న స్థంభానికి కట్టేశారు. ఒంటెలను పెంచే వ్యక్తిగా భావిస్తున్న ఆ కుర్రాడు మద్యం మత్తులో ఉన్నాడని, ఫ్లైఓవర్ అంచుకు దగ్గరగా ప్రమాదకరంగా ప్రయాణించాడని తెలుస్తోంది.