Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పండగకు ఊరెళ్లేందుకు బయటకు వచ్చిన వారు వర్షానికి తడిసి ముద్దయ్యారు. ఇప్పటికే దసరా పండగకు చాలా మంది తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. రేపు పండగ కావడంతో మిగిలిన వాళ్లు కూడా బయలుదేరి తమ గ్రామాలకు వెళుతుున్నారు. అయితే ఒక్కసారిగా వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి భారీ వర్షం కురిసింది.
ఒక్కసారిగా కురవడంతో...
దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా పండగ షాపింగ్ కు బయటకు వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంట పాటు కురిసిన భారీ వర్షంతో కొన్ని లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరింది. పండగ కోసం ముస్తాబు చేసుకున్నదంతా వర్షానికి మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని నగరవాసులు వాపోతున్నారు. దుర్గామాత మండపాల్లోకి కూడా కొన్ని చోట్ల నీరు చేరింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురవడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులు కూడా వ్యాపారాలు లేక ఆర్థికంగా వర్షం తమను దెబ్బతీసిందని చెబుతున్నారు.