Hydearbad : గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షం...నగరవాసుల ఇబ్బందులు
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. గత రెండు రోజుల నుంచి భారీ వర్షం పడుతుంది.
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. గత రెండు రోజుల నుంచి భారీ వర్షం పడుతుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే పిల్లలు వర్షం దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో ఏ పని చేయడానికి వీలులేకుండా పోయింది. చల్లటి వాతావరణంతో పాటు ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం పడుతుండటంతో అనేక రహదారులపై నీరు ప్రవహిస్తుంది. వర్షం పడుతుండటంతో అనేక ప్రాంతాలు హైదరాబాద్ లో తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
బయటకు వచ్చేందుకు...
ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, అమీర్ పేట్, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, రామాంతపూర్, అమీర్ పేట్, లక్డీకాపూల్, మొహదీపట్నం, చందానగర్, మలక్ పేట్, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి. ఇక ఆఫీసుకు వెళ్లేందుకు వాహనాలు రోడ్డు పైకి చేరుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేయాల్సివచ్చిందని స్థానికులు చెబుతన్నారు. గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుండటంతో ఎక్కడికి వెళ్లి తలదాచుకుందామనుకున్నా వీలుకాలేదంటున్నారు
రహదారులపై నీరు...
రహదారులపైకి నీరు చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురియడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగకుండా వర్షం కురవడంతో అనేక చోట్ల నగరంలో విద్యుత్తు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగానే వర్షం పడుతుండటంతో ముఖ్యంగా పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు సయితం రోడ్లపైన విక్రయించేందుకు వచ్చి వర్షం పడటంతో అవస్థలు పడుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యాపారాలు మందగించాయి. కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయని అంటున్నారు. మొత్తం హైదరాబాద్ లో భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలంగా మారింది.