Breaking : చందానగర్ లోని ఖజానా జ్యుయలరీలో కాల్పులు

చందానగర్ లో కాల్పుల కలకలంరేగింది.ఖజానా జ్యుయలరీ దుకాణంలో దుండగులు బంగారు నగలను చోరీ చేసేందుకు ప్రయత్నించారు

Update: 2025-08-12 06:13 GMT

చందానగర్ లో కాల్పుల కలకలంరేగింది. ఖజానా జ్యుయలరీ దుకాణంలో దుండగులు బంగారు నగలను చోరీ చేసేందుకు ప్రయత్నించారు.చందానగర్ లో ఉన్న ఖజానా జ్యుయలరీలో ఈ దోపిడీకి దుండగులు పాల్పడ్డారు.ఈ సందర్భంగా దుకాణంలోకి వచ్చిన దుండగులు అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలో ఒకరికి గాయలపాలయ్యాయి.

ఒకిరికి గాయాలు...
అయితే ఖజానా జ్యుయలరీ సిబ్బంది దుండగులపై తిరగబడటంతో వారు పారిపోయారు. దుండగులకాల్పుల్లో గాయపడిన వ్యక్తిని స్థానికంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ లను సేకరించేందుకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ః


Tags:    

Similar News