Hyderabad : నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300 లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై చర్చించనున్నారు. వార్డుల డీలిమిటేషన్ పై కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు తమ అభ్యంతరాలను , సూచనలను తెలియజేయనున్నారు.
వార్డుల డీ లిమిటేషన్ పై...
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో వార్డుల సంఖ్యను పెంచుతూ నోటిఫికేషన్ విడుదలయింది. దీనిపై కార్పొరేటర్లు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,300 వరకూ అభ్యంతరాలు రావడంతో నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించారు.