Hyderabad : నేటి నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకం
నేటి నుంచి తెలంగాణలో ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
నేటి నుంచి తెలంగాణలో ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మాత్రమే ఐదు రూపాయలకు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా నేటి నుంచి ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. పేదలకు తక్కువ ధరకే అల్పాహారంతో పాటు భోజనం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
తొలిదశలో అరవై చోట్ల...
ఈరోజు నుంచి హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటిన్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. తొలి దశలో హైదరాబాద్ నగరంలో అరవై ప్రాంతాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నారు.