Hyderabad : రేపటి నుంచి నుమాయిష్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది

Update: 2025-12-31 03:06 GMT

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. జనవరి వస్తుందంటే హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను ఏర్పాటు చేస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులందరూ వచ్చి ఇక్కడ తమ అమ్మకాలను కొనసాగిస్తారు. నుమాయిష్ లో తక్కువ ధరకు నాణ్యమైన వస్తువుల లభిస్తాయని నగరవాసుల నమ్మకం.

ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకూ...
అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతుండటంతో సందర్శకులు ప్రతి ఏడాది పోటెత్తుతారు. ప్రతి ఏటా నుమాయిష్ జనవరి 1వ తేదీన ప్రారంభమవుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వందల సంఖ్యలో స్టాల్స్ ఈసారి నగరవాసులను అలరించనున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ నెలన్నర రోజులు నుమాయిష్ ను సందర్శించి ఆనందించే వీలుంది.


Tags:    

Similar News