Gold ATM: హైదరాబాద్ లో మెరిసిపోతున్న బంగారు ఏటీఎం

హైదరాబాద్ లో సాధారణ ఏటీఎం యంత్రాల పక్కనే ఓ గోల్డ్ రంగు ఏటీఎం తెగ మెరిసిపోతూ

Update: 2023-12-30 03:09 GMT

హైదరాబాద్ లో సాధారణ ఏటీఎం యంత్రాల పక్కనే ఓ గోల్డ్ రంగు ఏటీఎం తెగ మెరిసిపోతూ మెట్రో ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎం(Gold ATM)రెండో వెర్షన్ ‘గోల్డ్ ఏటీఎం వెర్షన్-2’ను తీసుకుని వచ్చారు. గోల్డ్‌ సిక్కా(goldsikka)లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా బంగారు, వెండి కాయిన్లను ఈ గోల్డ్ ఏటీఎంలో తీసుకునే విధంగా ఈ ఏటీఎంను డిజైన్ చేశారు. వినియోగదారుల నుంచి ఆశించిన దానికంటే మంచి స్పందన వచ్చిందని గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ యాజమాన్యం తెలిపింది.

ఈ వినూత్న విధానం వినియోగదారులకు విభిన్న ప్రాధాన్యతలను అందిస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలమైన, సమర్థవంతమైన మార్గాలను అందిస్తుంది. మొదటి యంత్రంలా కాకుండా, గోల్డ్ ATM వెర్షన్-2 లో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు బంగారం, వెండి నాణేలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. “మేము గత సంవత్సరం బేగంపేటలో మొదటి యంత్రాన్ని ప్రారంభించాము. ATM ఈ కొత్త వెర్షన్ 0.5 గ్రాములు, 1 గ్రాములు, 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల నుండి బంగారు నాణేలను, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు వెండి కాయిన్స్ ను కూడా పంపిణీ చేస్తుంది. ”అని గోల్డ్‌సిక్కా CEO తరూజ్ అన్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఇలాంటి మెషీన్లను ఇన్‌స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Tags:    

Similar News