Gold Rates Today : హిస్టరీ క్రియేట్ చేసిన గోల్డ్ రేట్స్

బంగారం ధరలు భారీగా పెరిగాయి.వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2025-10-08 07:40 GMT

బంగారం ధరలు ఈరోజు మరింతగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు విపరీతంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 1150 రూపాయల వరకూ పెరిగిందని హైదరాబాద్ బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు మాత్రం మరింత పెరుగుతున్నాయి.

ధరలు ఇలా...

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై 1,250 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,900 రూపాయలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 1,23,170 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,67,000 రూపాయలుగా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.


Tags:    

Similar News