Hyderabad : హైదరాబాద్ లో ఆక్రమణల తొలిగింపు.. టెన్షన్
హైదరాబాద్ లోని నాంపల్లి - అహ్మద్ నగర్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు
హైదరాబాద్ లోని నాంపల్లి - అహ్మద్ నగర్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండటంతో పాటు రోడ్ల విస్తరణ పనులు కూడా ఆగిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్ లపై ఆక్రమణలను ఈరోజు ఉదయం నుంచి తొలగిస్తును్నారు.
నాంపల్లిలోని...
పొట్టకుటి కోసం పనులు చేసుకునే తమ షాపులను తొలగించవద్దని.. అధికారుల ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా షాపులను కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.