నేటితో ముగియనున్న జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు
నేటితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగియనుంది
నేటితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగియనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్‌లుగా చేస్తూ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దాదాపు మూడు వందల వార్డులను ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి...
పాలకమండలి గడువు ముగియడంతో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నేడు వార్డుల ప్రకటన కూడా అధికారికంగా చేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన కొత్తగా మూడు కార్పొరేషన్లకు ఆఫీస్‌లు అధికారులు సిద్ధంచేశారు. ఆరు నెలల్లోపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.