నేడు సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు

నేడు సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు జరగనున్నాయి

Update: 2025-11-19 03:18 GMT

నేడు సౌదీ అరేబియాలో బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు జరగనున్నాయి. మక్కా సందర్శనకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ప్రయాణికులు బస్సు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన నలభై ఐదు మంది మరణించారు. దీంతో ప్రభుత్వం మృతులకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ఏర్పాట్లు...
ఈ మేరకు అంత్యక్రియలకు సౌదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మంత్రి అజారుద్దీన్, అధికారులతో పాటు మృతుల కుటుంబ సభ్యులను కూడా సౌదీ అరేబియాకు పంపింది. దీంతో 35 మంది కుటుంబసభ్యులు సౌదీకి వెళ్లారు. వీరితో పాటు ముగ్గురు హజ్‌ కమిటీ సభ్యులు కూడా వెళ్లారు. నేడు అక్కడ మృత దేహాలకు అంత్యక్రియలు జరగనున్నాయి.


Tags:    

Similar News