ప్రాణాలొదిన యాంకర్ స్వేచ్ఛ
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు. ఫ్యానుకు లుంగీతో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వేచ్ఛకు ఒక కుమార్తె ఉన్నారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. ఇటీవలే జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.