Hyderabad : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం?

రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నగరంలోని రెండు ప్రధాన ఫ్లైఓవర్లను పరిశీలించారు.

Update: 2025-09-12 02:01 GMT

రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నగరంలోని రెండు ప్రధాన ఫ్లైఓవర్లను పరిశీలించారు. జూబ్లీహిల్స్‌ – మాదాపూర్‌ను కలిపే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్‌ తో పాటు కొండాపూర్‌ – గచ్చిబౌలిని కలిపే పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లను ఆయపదగ్గరుండి పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు.

రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్‌...
ఈ పర్యటనలో ఆయనతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, సీసీటీవీ కెమెరాలు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రంబుల్ స్ట్రిప్స్, చెవ్రాన్ బోర్డులు, కాంక్రీట్ బారియర్లు మరియు రాత్రి సమయంలో మెరుగైన వెలుగు వచ్చేందుకు అవసరమైన ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైటింగ్‌ను పరిశీలించారు.


Tags:    

Similar News