డ్రోన్ల సాయంతో వరద బాధితులకు ఆహార పంపిణీ
మూసీ పరివాహక ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారాన్ని డ్రోన్ సాయంతో అందిస్తున్నారు
మూసీ పరివాహక ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారాన్ని డ్రోన్ సాయంతో అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది పొంగి ప్రవహిస్తుంది. అనేక ప్రాంతాల్లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. దీంతో వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించాలన్నా అక్కడకు వెళ్లేందుకు సహాయక సిబ్బందికి ఇబ్బందిగా మారింది.
మునిగిపోయిన ప్రాంతాల్లో...
దీంతో డ్రోన్ల సాయంతో ఆహార పొట్లాలను, నీటి బాటిళ్లను అందిస్తున్నారు. మలక్ పేట్ పరిధిలోని బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. హైడ్రా కమిషనర్, మలక్ పేట్ ఎమ్మెల్యేలు కలసి దీనిని పర్యవేక్షిస్తున్నారు. కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లను చేశారు.