Breaking : హైదరాబాద్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీపై దాడికి యత్నం జరిగింది
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీపై దాడికి యత్నం జరిగింది. చాదర్ ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నించారు. సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కావడంతో నాంపల్లిలోని ఒక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. సెల్ ఫోన్ దొంగలు కత్తితో చైతన్యపై దాడికి యత్నంచాడు.
కత్తితో దాడి జరిపి...
కత్తితో దాడి జరిపి పారిపోయేందుకు ప్రయత్నించి పారిపోతుండగా డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. డీసీపీపై కత్తితో దాడికి యత్నించిన పరిస్థితుల్లోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులలో ఒకరు పారిపోయారు. అతని కోసం గాలిస్తున్నారు. వారిలో ఒకరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.